అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుగుపునే రాఖీ పండుగ వచ్చేసింది. తరాలు మారి అనుబంధాలు, ఆత్మీయతలు దూరమవుతున్న నేటి ఆధునిక సమాజంలో బంధాలను కలిపేందుకు రాఖీలు మళ్లీ వచ్చాయి. మార్కెట్‌లో ఎక్కడ చూసిన రాఖీల సందడి కనిపిస్తోంది. బొమ్మల రాఖీలు, నక్షత్ర రాఖీలతో పాటు ఈ సంవత్సరం వచ్చిన కొత్త రాఖీలపై మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. అన్న నుంచి తాము ఆశించేది ప్రేమాప్యాయతలేనని రాఖీ కొనేందుకు వచ్చిన మహిళలు అంటున్నారు. కాలం మారుతున్నా రాఖీలు కట్టే సంప్రదాయం ఎప్పటికీ ఆగిపోదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రాఖీలు కొనేందుకు వచ్చిన మహిళలు స్వతంత్రతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.