కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఇటీవల జిల్లాకు మంత్రి సీతక్క వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే అయిన తనను అవమానించారని కోవ లక్ష్మి విమర్శించారు. మంత్రి అధికారిక కార్యక్రమంలో తనకు తెలియకుండా డీసీసీ అధ్యక్షుడు, నియోజ కవర్గం ఇన్చార్జి ఏ హోదాలో పాల్గొన్నారని కలెక్టరేట్ వద్ద కోవ లక్ష్మి ధర్నా చేపట్టారు. డీసీసీ చీఫ్ విశ్వ ప్రసాద్‌పై ఆమె పరుష పదాలతో విమర్శించారు. కోవ లక్ష్మి తీరుపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీస్ స్టేషన్లో కోవ లక్ష్మి పై ఫిర్యాదు చేశారు.