ఉక్రెయిన్, ఇజ్రాయిల్‌లో యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి వర్ధిల్లిలాలని ఆయన ఆకాంక్షించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సంయుక్తంగా కలిసి ఉండడంలోనే మానవత్వం విజయం సాధిస్తుందని, యుద్ధ రంగంలో కాదు అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం .. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు కీలకమని అన్నారు. ఆధునీకరణకు సంస్కరణే ముఖ్యమైందని చెప్పారు.