ప్రముఖ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారని వర్మపై కేసు నమోదంది. వర్మ కనిపిస్తున్నాడు.. వినిపిస్తున్నాడు… కానీ పోలీసుల అందుబాటులోకి మాత్రం రావడం లేదు. సోషల్ మీడియాలో వర్మ ఇంటర్వ్యూలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్‌లోనే మకాం వేసి.. వర్మ కోసం ఐదు రోజులుగా గాలిస్తున్నారు.
నిన్న ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. తాను ఎక్కడికీ పారిపోలేదని డెన్ ఆఫీసులోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. తన ఆఫీసులోకి పోలీసులు ఇంత వరకు అడుగు పెట్టలేదన్నారు. తనను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు తన మనుషులతో కానీ.. మీడియాతో కానీ చెప్పలేదని అన్నారు. ఒక వేళ తనను అరెస్ట్ చేయడానికి వస్తే తన ఆఫీసులోకి ఎందుకు రారు అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు వర్మ.