24.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

హరీశ్‌రావుకు కేసీఆర్‌పై కోపం, ఈర్ష్య ఉంది: పేర్ని

స్వతంత్ర, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తి పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఎన్ని జన్మలు ఎత్తినా బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవదని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మొన్నటి వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు ఘోరంగా ఓడించారని తెలిపారు. మనువు బీజేపీతో మనస్సు చంద్రబాబుతో ఉన్న సీఎం రమేష్, సత్య కుమార్, సుజనా వంటి వారి మాటలను వింటూ తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక ఏపీలో ఉన్నది మాటల ప్రభుత్వమేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసినా విమర్శలపైనా నాని స్పందించారు. హరీశ్ రావుకు మేనమామ కేసీఆర్ మీద కోపం, ఈర్ష్య ఉందని అందుకే కోపం వచ్చినప్పుడల్లా మమ్మల్ని తిడతాడని తెలిపారు. తాము తిరిగి కేసీఆర్‌ను విమర్శిస్తే సంతోషించాలని హరీశ్ అనుకుంటున్నారని ఆరోపించారు. 2018లో హరీశ్ రావు చేతలు ఎక్కువయ్యాయని స్వయంగా కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారని పేర్ని వెల్లడించారు.

Latest Articles

విజయ్ దేవరకొండ- దిల్ రాజు సినిమాకు ఆడిషన్స్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో మరో క్రేజీ మూవీలో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్