స్వతంత్ర వెబ్ డెస్క్: అనారోగ్య సమస్యలతో బ్రేక్ పడిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. భట్టి పాదయాత్ర 100రోజుకి చేరువైంది. 100వ రోజైన రేపు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుండగా.. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్ ఏర్పాటు చేయనున్నారు.. రాత్రికి కొప్పోలు గ్రామంలో బస చేయనున్నారు భట్టి విక్రమార్క. అయితే వడదెబ్బ, తీవ్ర జ్వరంతో భట్టి విక్రమార్క పాదయత్రకి బ్రేక్ పడింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఇప్పటివరకు ఉన్న భట్టి.. రేపటినుండి తిరిగి పీపుల్స్ మార్చ్‌ని ప్రారంభించనున్నారు.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పాదయాత్ర చేయవచ్చని డాక్టర్లు సూచించడంతో.. డాక్టర్ల సూచన మేరకు రేపటినుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు..
మార్చి 16న చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇప్పుడు వందో రోజుకు చేరువైంది..మార్చిన 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజరహాత్నూర్ మండలం పిప్పిరి గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు భట్టి.. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్ పూర్, జనగామ, అలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ నగర్, పరిగి, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ, నాగార్జునసాగర్, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇప్పుడు నకిరేకల్‌లో సాగుతోంది భట్టి పాదయాత్ర.