TSPSC Paper Leak |పేపర్ లీకేజీ వ్యవహారంపై పీడీఎస్యూ ఆందోళన చేపట్టింది. ప్రగతి భవన్ కు ముట్టడికి పలువురు విద్యార్థులు యత్నించారు. పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని నినాదాలు చేస్తూ ప్రగతి భవన్ లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడరాదని.. ఈ ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు.. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read Also: ఈరోజు విచారణకు రాలేను: కవిత
Follow us on: Youtube Instagram