స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మండల అధ్యక్షులతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ, ఎన్నికలకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గం.లకు పవన్ ప్రసంగం మొదలవుతుంది. అయితే ఇదివరకే పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామంటున్న పవన్ ప్రకటనపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించనున్నారు.