ప్రజా సంపద దుర్వినియోగం చేసిన వారిలో ఎవరినీ వదిలిపెట్టమని తేల్చి చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెలిపారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం కర్ణాటకలో అమ్ముకున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామని పవన్ కల్యాణ్ చెప్పారు.