స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం సమీపంలో మరోసారి పేలుళ్ల కలకలం సృష్టించింది. గురువారం నాడు అర్ధరాత్రి 12:30 గంటల సమీపంలో పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ముగ్గురు నిందితులు పేలుడు జరిగిన ప్రాంతానికి దగ్గరలో గల ఒక గదిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిలో ఇద్దరు పురుషులు.. ఒక మహిళ ఉన్నట్లు వెల్లడించారు. బాంబు పేలుడుకు పొటాషియం క్లోరేట్ ను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయం సమీపంలో వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పేలుళ్లు చోటు చేసుకోవడం గమనించదగ్గ విషయం.