అభివృద్ధి అంటే మాధాపూర్, హైటెక్ సిటీ కాదని.. పాత బస్తీని అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ, బౌద్ధ నగర్ డివిజన్, పార్సిగుట్టలో సొంత నిధులతో నిర్మించిన రెండంతస్థుల కమ్యూనిటీ హాల్‌ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌లో కలిసి కట్టుగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బస్తీల్లో రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, వంటి అనేక మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ.. కేటాయింపుల్లో పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు.