వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. గతంలో రుణమాఫీ సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందని చెప్పారు. ORRను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని విమర్శించారు. గత పాలకులు సరైన పద్ధతిలో రుణమాఫీ చేయకపోయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ద్వారా రాజకీయ లబ్ధి పొందలేరని మంత్రి తుమ్మల అన్నారు.