19.7 C
Hyderabad
Thursday, March 19, 2026
spot_img

విద్యార్థులెవ్వరూ ఒత్తిడికి గురి కావొద్దు- కృష్ణ ఆదిత్య

ఎల్లుండి నుండి తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం అవుతాయని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 96 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1532 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంటర్ పరీక్షలు జీవితంలో తొలిమెట్టు మాత్రమే అని.. విద్యార్థులెవ్వరూ ఒత్తిడికి గురి కావొద్దని సూచించారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అన్నట్టు కాదన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీని కోరామని చెప్పారు. ఎండలు ఎక్కువ ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందీ రాకుండా మెడికల్ సదుపాయాలు ఉంటాయన్నారు. హాల్ టికెట్ల మీద ఈ సారి క్యూ ఆర్ కోడ్ ఉంటుందన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు సెంటర్లకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో పరీక్షల నిర్వహణపై సమీక్షలు జరిపామని కృష్ణ ఆదిత్య వివరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్