విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే సందర్భంగా భారత నౌకాదళ వాయువిభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భారత నౌకాదళ పాటవం, పరాక్రమం ప్రదర్శించారు. దాదాపు 8 వేల అడుగుల ఎత్తు నుంచి పారాచూట్ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండాను ఎగురవేసి ఆహుతులను అలరించారు
విశాఖ సాగరతీరంలో యుద్ధ విన్యాసాలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు, నౌకలు సందడి చేశాయి. ఉగ్రవాదుల నుంచి బందీలను రక్షించే యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అలాగే సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో రక్షించే విధానం ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సముద్రంలో బంకర్ పేలుళ్లు వంటివి ఆకట్టుకున్నాయి. నేవీ డే విన్యాసాలను చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో సాగర తీరం జనసంద్రంగా మారింది.