38.2 C
Hyderabad
Sunday, May 3, 2026
spot_img

Nara Lokesh | తగ్గేదే లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో.. పెద్దిరెడ్డికి లోకేశ్ మాస్ వార్నింగ్

Nara Lokesh Warns Peddireddy Ramachandra Reddy| టీడీపీ యువనేత నారా లోకేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో కొనసాగుతోంది. పుంగనూరులో పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలంట.. భూములు దోచుకున్నందుకు పెద్దాయన అని పిలవాలా? ఇసుకను దోపిడీ చేసినందుకు పెద్దాయన అని పిలవాలా? దేనికి పిలవాలని లోకేశ్ ప్రశ్నించారు. పుంగనూరులో మాత్రం అమూల్ డైరీ లేదని.. పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డైరీనే తక్కువ ధర చెల్లిస్తూ పాడి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రూ.10వేల కోట్లను దోచుకున్న పెద్దిరెడ్డిని శాశ్వతంగా ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. దోచుకున్నదంతా కక్కించి పుంగనూరు ప్రజలకు కానుకగా ఇస్తామన్నారు. తగ్గేదే లేదని, ఏం చేసుకుంటావో చేసుకో పెద్దిరెడ్డీ అంటూ లోకేశ్(Nara Lokesh) సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Read Also: కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఏపీ ప్రభుత్వం MOUలు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్