24.7 C
Hyderabad
Sunday, October 1, 2023

ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషాకు కవలలు.!-300 కిలోల బంగారం దానం చేయాలని నిర్ణయం

  • అమెరికా నుంచి కవలలతో వచ్చిన ఈషా దంపతులు
  • ఐదు అనాథాశ్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రకటన
  • కవల పిల్లలకు వివిధ దేవాలయాల అర్చకుల ఆశీర్వచనం

దేశంలోనే నెంబర్ 1 కోటీశ్వరుడు ముఖేశ్ అంబానీ ఇంట పెద్దపండుగే జరిగింది. ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ, అజయ్ పిరమల్ దంపతులకు అమెరికాలో కవలపిల్లలు పుట్టారు. కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో ఒకే కాన్పులో పాప, బాబు పుట్టారు. ముఖేశ్ అంబానీకి తాతగా ప్రమోషన్ వచ్చింది. అసలే అపర కుబేరుడు.. ఆపై తాత అయ్యాడు. ఆ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన ముఖేశ్ అంబానీ.. ఏకంగా 300 కిలోల బంగారాన్ని దానం చేయాలని నిర్ణయించారు. 2018లో అంబానీ కుమార్తె వివాహం జరిగింది.

పండంటి మనుమడు, మనుమరాలితో వచ్చిన ఈషా అంబానీ దంపతులకు, అంబానీ, పిరమల్ కుటుంబాలు ఘనంగా స్వాగతం పలికాయి. కవలలు దేశంలోకి వస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల అర్చకులను రప్పించి ఆశీర్వచనం ఇప్పించారు ముఖేశ్ అంబానీ. మరో ప్రత్యేకత ఏమిటంటే.. కవలల సంరక్షణకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన 8 మంది అమెరికన్ నానీస్లను కూడా ఈషా తమవెంట తీసుకువచ్చారు. ముఖేశ్ మనుమరాలికి ఆదియా అని, అబ్బాయికి కృష్ణా అని పేరుపెట్టారు. ముఖేశ్ కొడుకు ఆకాశ్ అంబానీకి గతంలో ఓ కొడుకు పుట్టాడు. అంటే.. ముఖేశ్ రెండోసారి తాతగా ప్రమోషన్ పొందారన్నమాట.

Latest Articles

సంక్రాంతి బరిలో లైకా ప్రొడక్షన్స్ ‘లాల్ సలాం’

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
290FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్