32.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

రైతుల డిమాండ్ల పై తొలిసారి స్పందించిన మోదీ

   అన్నదాతల చలో ఢిల్లీ ఆందోళనపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి పెదవి విప్పారు. రైతుల సంక్షేమానికి ఉపయోగ పడే ప్రతి తీర్మానానికి అలాగే డిమాండ్‌ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాజాగా చెరకు కొనుగోలు ధరను తమ ప్రభుత్వం పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. 2023-24 సీజన్‌లో చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ కంటే ఎనిమిది శాతం ఎక్కువ ఇవ్వడానికి కేంద్రమంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.ఈ ఆమోదం తెలిపిన మర్నాడే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రకటన చేశారు. సవరించిన ఎఫ్ఆర్పీ ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చెరకు ఉత్పత్తి చేసే లక్షల మంది రైతులకు ప్రయోజనాలు కల్పిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

    అన్నదాతల ఆందోళన ఫలితంగా ఢిల్లీ సరిహద్దుల్లో యుద్దవాతావరణం కొనసాగుతోంది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం పట్టుబడుతున్న రైతులు ఎక్కడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ డిమాండ్ల సాధన కోసం కేంద్ర ప్రభుత్వానికి రైతులు డెడ్‌లైన్ విధించారు. అయితే ఈ డెడ్‌లైన్ పూర్తయింది. దీంతో పంజాబ్-హర్యానా సరిహ ద్దులోని శంభు బోర్డర్ నుంచి రైతులు ఢిల్లీ వైపు దూసు కొచ్చారు. దీంతో దూసుకువస్తున్న రైతులను పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాయి. రైతులు హస్తినలోకి ప్రవేశిం చకుండా ఎక్కడికక్కడ కాంక్రీట్ బ్లాక్‌లు, బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. అంతేకాదు కంటైనర్ల గోడలతో ఢిల్లీవైపు నుంచి వచ్చే దారులను మూసివేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీ సరిహద్దుల్లో ఘాజీపూర్ చాలా ముఖ్యమైనది. రైతులను అడ్డుకోవడానికి ఘాజీపూర్‌ సరిహద్దు దగ్గర భారీగా పోలీసు, కేంద్ర బలగాలను మోహరిం చారు. అలాగే సింఘు, టిక్రి సరిహద్దులను మూసిచేశారు. రైతులపై బాష్పవాయుగోళాలను పోలీసులు పదేపదే ప్రయోగించారు.

     బాష్పవాయుగోళాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి రైతులు ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లతో వచ్చారు. మొహాలకు మాస్కులు, కళ్లద్దాలు ధరించారు. పంటల కనీస మద్దతు ధర విష యాన్ని తేల్చిన తరువాతే చర్చలపై తాము స్పందిస్తామన్నారు. ఇదిలా ఉంటే, రైతుల ఆందోళన కారణం గా ఢిల్లీలో అనేకచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.ఇదిలాఉంటే రైతుల డిమాండ్లపై కేంద్రం మరోసారి స్పందించింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిం చుకుందామని పేర్కొంది. ఐదో విడత చర్చలకు రైతు నాయకులను ఆహ్వానించింది. రైతులపై నమోదైన కేసులను ఎత్తేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే పంటలకు కనీస మద్దతు ధర తేలిన తరువాతే చర్చల గురించి ఆలోచిస్తామన్నారు రైతు సంఘాల నేతలు.

     అన్నదాతల ఆందోళనను అణచివేయడానికి పాలకవర్గాలు చేస్తున్న ప్రయత్నాలపై రైతు సంఘాల నేతలు మండిప డుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ట్రాక్టర్లతో ఢిల్లీ బయల్దేరిన రైతులను అడ్డుకోవడానికి రహదారులకు అడ్డంగా కట్టి డ్రోన్లతో టియర్‌గ్యాస్ ప్రయోగాలు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కంటే తీవ్రమైన విషయం అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. దేశానికి అన్నంపెట్టే రైతుల మీదే కేంద్ర ప్రభుత్వమే తుపాకులు దూయడం దేశ ప్రతిష్టకు సిగ్గుచేటు అంటున్నారు. అన్నదాతల డిమాండ్ల విషయమై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నది రైతు సంఘాల నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగానే రైతు అంశం రాజకీయ అంశంగా మారిందంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంటల కు కనీస మద్దతు ధరపై ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపలేదు. అంతేకాదు మూడు సంవత్సరాల కిందట ఢిల్లీ శివార్లలో ఆందోళన నిర్వహించిన అన్నదాతలపై పెట్టిన కేసులను ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం ఉపసంహరించు కోలేదు. దీనినే ప్రస్తుతం రైతన్నలు ప్రస్తావిస్తున్నారు. మూడేళ్ల కిందట ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేసి తీరాలని అన్నదాతలు కోరుతున్నారు.

Latest Articles

షకీల్ కుమారుడు రాహిల్ కేసులో కీలక మలుపు

  మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రజా భవన్ వద్ద ప్రమాదానికి పాల్పడిన రాహిల్‌ కేసులో నిందితుడికి సహకరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్