బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) నేడు ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీకి వెళ్లేముందు సీఎం కేసీఆర్‌తో కాసేపు కవిత చర్చించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొద్దీ రోజులుగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు నేడు మరొక్కసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీనిపై స్పందిస్తూ సీబీఐకు కవిత లేఖను కూడా రాశారు. ఢిల్లీలో ఈ నెల 10 న దీక్షలో పాల్గొనడంతోపాటు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని వివరించింది. రేపు విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నా కూడా.. ఇప్పటివరకు సీబీఐ స్పందించకపోవడంతో ఢిల్లీకి పయనమయ్యారు కవిత.
అయితే సీఎం కేసీఆర్(KCR) మాత్రం పార్టీ నీకు అండగా ఉంటుందని.. నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. న్యాయపరంగా బీజేపీ ఆకృతాలపై పోరాడుదామని ఫోన్ లో తెలిపారు. కాగా, కవిత రాసిన లేఖకు ఈడీ స్పందిస్తుందా.. లేదా విచారణకు ఎట్టి పరిస్థితిలోనైనా హాజరుకావాల్సిందేననని అంటుందా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.