ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వరుసగా రెండో రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. తన పాత ఫోన్లను తీసుకొని ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దీనికి ముందు కవర్లలో తీసుకెళ్తున్న 9 ఫోన్లను కవిత మీడియాకు చూపించారు. మద్యం కేసుకు సంబంధించి ఆధారాలున్న ఫోన్లను కవిత ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. నిన్నటి విచారణలో మొత్తం పది గంటల పాటు 14 ప్రశ్నలు కవితను ఈడీ అడిగినట్లు తెలిసింది. దీనికి సమాధానంగా తనకు లిక్కర్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని.. ఇది రాజకీయ కుట్రనే అని కవిత అధికారులతో అన్నట్లు తెలుస్తోంది.
Read Also: మేడారం గోవింద రాజుల పూజారి దబగట్ల రవి దారుణ హత్య
Follow us on: Youtube Instagram