గుజరాత్‌ను రోల్ మోడల్‌గా తీసుకుని ఏపీలో పరిశ్రమలు అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు మంత్రి టీజీ భరత్. సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు . 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన బాధ్యత లు స్వీకరించారు. ప్రస్తుతం ఏపీ స్పెషల్ స్టేటస్ కోల్డ్ స్టోరేజ్‌లో ఉందని అన్నారు. అయితే స్పెషల్ స్టేటస్ కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ తరహా గిఫ్ట్ సిటీ ఏపీలో నిర్మాణం చేయించాలని ముఖ్య మంత్రి చంద్రబాబును కోరనున్నట్టు తెలిపారు మరోవైపు తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.


