బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ టాపింగ్‌లో తన భర్త కొండా మురళి ఫోన్ కూడా ఉందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో సమన్వయ లోపాన్ని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఇక నుండి ప్రతిరోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉంటామని చెప్పారు. వరంగల్‌లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయం, పురాతన దేవాలయాలను అభివృద్ధి చేస్తామని మంత్రి కొండ సురేఖ చెప్పారు.


