వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శల జోరు మరింత పెంచారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. అబద్దాల్లో జగన్‌కు ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు మంత్రి. పోలవరం ఎత్తు విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలంటూ వైసీపీ అధినేతకు హితవు పలికారు మంత్రి నిమ్మల.
పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు ఫేజ్‌లుగా విభజించింది జగన్ కాదా అంటూ నిలదీశారు మంత్రి నిమ్మల. అంతేకాదు 41.15 మీటర్లకు పోలవరం ఎత్తు తగ్గించాలని కేంద్రం అనుమతి కోరింది ఎవరు అని ఎక్స్‌లో ప్రశ్నాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం 45.72 మీటర్లకు పోలవరం ఎత్తు పెంచి నదుల అనుసంధానం ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే ఏర్పాట్లు చేస్తోందన్నారు మంత్రి నిమ్మల.
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను 15 నెలలు ఆలస్యం చేసింది ఎవరన్నారు నిమ్మల. డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారకులెవరని ప్రశ్నించారు. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ట్వీట్‌లో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన 3 వేల 8 వందల కోట్లను దారి మళ్లించారంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు మంత్రి నిమ్మల. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని సైతం జగన్ మోసం చేశారంటూ ఆరోపించారు మంత్రి నిమ్మల. ప్రజా జీవనంలో ఉండే అర్హత లేదన్న విషయం వైసీపీ అధినేతకు అర్థమైందని.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.