హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణాలో వీ-హబ్(We Hub) ఐదో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్(KTR) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఔత్సాహిక మహిళలు మండల స్థాయి నుంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు వీలుగా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తామని అన్నారు.సింగిల్ విండో పద్ధతితో పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తామన్నారు. అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక ఉండదన్నారు. వీ హబ్ ద్వారా మహిళలు ఎదగటమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించటం ఆనందదాయకమని అన్నారు.
Read Also: ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
Follow us on: Youtube Instagram