Arogya Mahila Scheme |కరీంనగర్‌లో ఆరోగ్య మహిళ పథకాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకొచ్చామని అన్నారు. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని.. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యలక్ష్మి అనే పథకం తీసుకొచ్చామని అన్నారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలుఅందుబాటులో ఉంటాయని.. ఈ పథకం క్రింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ ఆరోగ్య మహిళ కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని మంత్రి స్పష్టం చేశారు.
Read Also: కవితకు ఈడీ నోటీసులు… మండిపడ్డ గంగుల కమలాకర్
Follow us on: Youtube Instagram