ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చాలా దుర్మార్గమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత అని అన్నారు. ఆస్తుల దోపిడేగానీ.. తరాల మధ్య ప్రేమలు పట్టించుకోడు జగన్ అంటూ నిప్పులు చెరిగారు. ప్రేమలు పట్టించుకోడు కాబట్టే చెల్లెళ్లను దూరంగా పెట్టాడని విమర్శిం చారు.


