కాంగ్రెస్‌పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎస్సీ వర్గీకరణ అయ్యేది కాదన్నారు. 2004లో కాంగ్రెస్ సహకరించక పోవడం వల్లే ఎస్సీ వర్గీకరణ రద్దైందని విమర్శించారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ వర్గీకరణ మీద ఒక్కసారి మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. బీజేపీ వల్లే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. సుప్రీం కోర్టులో ఓడిన మాదిగలు..అదే కోర్టులో నేడు గెలిచారన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా రేవంత్ ఎంపికైన తర్వాత మాదిగలకు అన్యాయం జరిగిందని మందకృష్ణ మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే రేవంత్‌కు ఎదురునిలబడతామని హెచ్చరించారు.