Uttar Pradesh | ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని బసెందువా గ్రామంలో సంచరిస్తున్న ఓ చిరుతపులిని బంధించేందుకు గ్రామంలో బోను ఏర్పాటుచేశారు. పులి కోసం ఎరగా కోడిని ఆ బోనులో ఉంచారు. అయితే బోనులో ఉంచిన కోడిని చోరి చేసేందుకు ఓ వ్యక్తి బోనులో దూరాడు. అంతే ఒక్కసారిగా బోను డోర్ మూసుకుపోయింది. దీంతో చేసేదేమి లేక బిక్కుబిక్కుమంటూ బోనులో ఉండిపోయాడు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో బోను డోర్ తెరిచి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.