సీఎం రేవంత్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వరద తీవ్రతకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. బాధితుల ఇళ్లను సందర్శించి, పరామర్శించనున్నారు. జిల్లాలో పలు చెరువులు తెగిపోవడంతో పాటు రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో రైళ్ల రాకపోకలు నిలిచాయి.
వరదలు తెలంగాణను అతులాకుతలం చేశాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రోడ్డు, రైళ్ల ట్రాక్స్, చెరువులు, ఊళ్లకు ఊళ్లు ధ్వంసమయ్యాయి. సింపుల్‌గా చెప్పాలంటే వరద పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. కాస్త వాతావరణం తెరిపి ఇవ్వగానే సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగేశారు.
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈరోజు ఆయన మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ మండలం తిరుమలాయపాలెం వంతెన, నెల్లికుదురు మండలం రావిరాల వద్ద ముఖ్యమంత్రి పర్యటించాల్సి ఉంది. అయితే సీఎం షెడ్యూల్‌లో ఇవాళ స్వల్ప మార్పులు చేసుకున్నాయి.
ఇవాళ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. కారేపల్లి మండలం గంగారం తండాలో మృతి చెందిన డాక్టర్ అశ్విని, ఆయన తండ్రి మోతీలాల్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. సీతారాంనాయక్ ఖమ్మం నుంచి నేరుగా తాండాకు చేరుకుంటారు. ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి. ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన పురుషోత్తంగూడెం బ్రిడ్జిని పరిశీలించనున్నారు.