CM KCR | దేశమంతటా కూడా తెలంగాణ తరహా పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర రైతు సంఘాల నాయకుడు శరద్ జోషి(Sharad Joshi)తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత దేశ రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. నా రాజకీయ జీవితమంతా పోరాటాలేనని.. సీఎంగా ఉండి కూడా రైతుల కోసం ఢిల్లీలో పోరాటాలు చేశానన్నారు. రైతుల పోరాటం వల్లే కేంద్రం 3 సాగు చట్టాలను రద్దు చేశారని అన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు.
తెలంగాణలో ఏం చేశామో మీరంతా చూడండి… తెలంగాణ వచ్చాక మా సమస్యలన్నీ తీరిపోయాయి. తలచుకుంటే ఏదైనా సాధ్యమే.. ఆలోచనలో నిజాయితీ, గెలవాలంటే చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. రైతుల పోరాటంపై ప్రధాని మోడీ(PM Modi) కనీసం స్పందించలేదు.. రైతుల్ని ఖలిస్తానీయులన్నారు.. రైతుల పోరాటం న్యాయబద్ధమయింది.. మీరంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించండి అప్పడు మీకే తెలుస్తది అంటూ అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు.
యాసంగి సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణలో యాసంగిలో 50 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు అవుతుందని గర్వంగా తెలిపారు. దేశమంతటా కూడా తెలంగాణ తరహా పరిస్థితి రావాలి. అన్నదాతల కష్టాలన్నీ తీరాలని సీఎం(CM KCR) ఆకాంక్షించారు.సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ దేశం అభివృద్ధి సాధించలేని.. చాలా దేశాల్లో రైళ్ల వేగం గంటకు 1500 కి.మీ. ఉంటే భారత్‌లో 150 కి.మీ. ఉందన్నారు.
Read Also: తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడికి షర్మిల శ్రీకారం
Follow us on: Youtube, Instagram, Google News