కేంద్రమంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు పంపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిరాధారమైన ఆరోపణలు చేసి తన పరువుకు నష్టం కలిగించేలా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు కేటీఆర్.
తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు కేటీఆర్. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ విషయాల్లో నిరాధారమైన ఆరోపణలు చేశారని ప్రస్తావించారు. వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కేటీఆర్.