ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. దీంతో.. ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. FIR నమోదు కావడంతో క్వాష్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో కేటీఆర్ ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని క్వాష్ పిటిషన్లో కేటీఆర్ కోరే అవకాశం ఉంది.
ఫార్ములా –ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదైంది. ఆయనను ఏ1గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ని ఏ2గా ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఏసీబీ. వీళ్లకు త్వరలోనే నోటీసులు అందించి విచారణ చేపట్టే అవకాశం ఉంది.