వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy SridharReddy) ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించడం తప్పా అని ప్రశ్నించారు. సమస్యలపై సీఎం జగన్, మంత్రులు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగానని వ్యాఖ్యానించారు. పాదయాత్రగా తాను ఒక్కడినే అసెంబ్లీకి వచ్చానని.. సమస్యల గురించి ప్రస్తావించేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఐదు నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదని.. అదే తనని తిట్టడానికి ఇద్దరు మంత్రులకు 20నిమిషాలు సమయం ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు తన దగ్గరికి వచ్చి ఫ్లకార్డ్ చించివేశారని తెలిపారు. బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యేవరకు తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. అధికార మదంతో వ్యవహరిస్తున్నఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కోటంరెడ్డి(Kotamreddy SridharReddy) వెల్లడించారు.
Read Also: మూడో కన్ను తెరిచానంటే ఇక అంతే.. వైసీపీ ఎమ్మెల్యేకి బాలయ్య వార్నింగ్
Follow us on: Youtube Instagram