కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టనర్ అని అన్నారు. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. మెట్రో విస్తరణలో రేవంత్‌రెడ్డికి పేరు వస్తుందని, కేసీఆర్ హయాంలో మెట్రో విస్తరణ జరగలేదు కాబట్టి తన హయాంలో జరగవద్దని కిషన్ రెడ్డి భావిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టును క్యాబినెట్ లో అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.