స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖమ్మంలో ఈనెల 15న జరిగే కేంద్ర హోమ్ మంత్రి అమీత్ షా బహిరంగ సభ ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఖమ్మం సభను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా నేతలకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. ఈ సభకు రాష్ట్ర కమిటీ నాయకులు సభకు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతామన్నారు.