జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ నర్సు నిమిషా ప్రియకు మరణశిక్షను యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి ఆమోదించారు. మీడియా కథనాల ప్రకారం ఒక నెల వ్యవధిలో శిక్షను అమలు చేయవచ్చు. ఈ పరిణామంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, నిమిషా ప్రియకు యెమెన్‌లో శిక్ష విధించడం గురించి తెలుసునని చెప్పింది.
ప్రియా కుటుంబానికి ఈ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తోందని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
2017లో యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీని హత్య కేసులో నిమిషా ప్రియా దోషిగా తేలింది. ఘటన జరిగిన ఏడాది తర్వాత యెమెన్‌లోని ట్రయల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. అప్పటి నుంచి ఆమె విడుదల కోసం కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు. ట్రయల్ కోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా వారు యెమినీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు, కానీ 2023లో వారి అప్పీల్ తిరస్కరించబడింది. ఇప్పుడు, దేశ అధ్యక్షుడు కూడా ప్రియా అప్పీల్‌ను తిరస్కరించడంతో, ఇప్పుడు బాధితుడి కుటుంబ సభ్యులపై ఆధారపడి ఉంది. ఆమె విడుదల హత్యకు గురైన కుటుంబ సభ్యుల క్షమాభిక్ష మీద ఆధారపడి ఉంది. , వారి గిరిజన నాయకుల నుండి క్షమాపణ పొందడంపై ఆధారపడి ఉంది.
నిమిషా ప్రియను మరణ శిక్ష నుంచి తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించిన కుటుంబ సభ్యులు.. తిరిగి భారత్ చేరుకున్నారు. ఇంతలోనే యెమెనీ అధ్యక్షుడి నిర్ణయం వారి కుటుంబాన్ని షాక్‌కి గురి చేసింది. ఆమె తల్లి ప్రేమ కుమారి,ఈ సంవత్సరం ప్రారంభంలో యెమెన్ రాజధాని సనాకు చేరుకుంది. మరణశిక్ష నుండి మినహాయింపు పొందేందుకు బాధితురాలి కుటుంబంతో చర్చలు జరపడానికి అక్కడే ఉంది.