ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఆప్ సర్కారు ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ఎల్‌జీ సెక్రటేరియట్ తాజాగా విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ సీఎం కేజ్రీవాల్ ఇవన్నీ తమను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ… కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుంటుందని విమర్శించారు. ఢిల్లీ ప్రజలకు తాము అందిస్తున్న సంక్షేమ పథకాలను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.