ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారికి గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం జరిగే ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టడం, ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోందన్నారు. ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు పేరు పెట్టడం అభినందనీయమని చెప్పారు.