టికెట్ రేట్ల పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి దేహి అని అడుక్కోవడం సరికాదన్నారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. సీఎంతో జరిగింది ఇండస్ట్రీ సమావేశం కాదని, వ్యక్తిగతంగా కొందరు ప్రభుత్వాన్ని కలిశారని తెలిపారు. సీఎంతో జరిగిన సమావేశం ప్రభుత్వం పిలిచిన మీటింగ్ కాదని అనుకుంటున్నాను అన్నారు తమ్మారెడ్డి. ఆ మీటింగుకు తనకు ఆహ్వానం అందలేదన్నారు. FDC చైర్మన్‌ను పిలవడంతో ఆయన కొంతమందిని తీసుకెళ్లారు. పుష్ప-2 తో ఏర్పడిన గ్యాప్ పోయిందని… అల్లు అర్జున్ ఇష్యూ సెట్ అయిపోయిందన్నారు.