Kavitha ED Invisitigation: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవితను మూడు గంటలుగా ఈడీ ప్రశ్నిస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఐదుగురు అధికారులు కవితను ప్రశ్నిస్తుండగా.. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారని సమాచారం. ఇండోస్పిరిట్స్ కంపెనీలో వాటాలు, రూ. 100కోట్ల ముడుపుల వ్యవహారంపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలతో విచారణ కొనసాగిస్తున్నారు అధికారులు. కవిత స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు వీడియో రికార్డు చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టైన రామచంద్ర పిళ్లైతో పాటు కవితను విచారిస్తున్నారు. మరోవైపు కవిత(Kavitha) విచారణ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఆమె అరెస్ట్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ పరిసరాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.