ఆంధ్రప్రదేశ్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాకు కోసం ఎదురుచూస్తున్నాడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో ఓటర్లను తప్పించడానికి చంద్రబాబు టెక్నాలజీ ఉపయోగించారని అన్నారు. పాలన సరిగ్గా చేస్తుంటే అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఏముంది? అంటూ మండిపడ్డారు. దొంగ ఓట్లు చేర్చడం వంటి అలవాట్లు టీడీపీకే ఉన్నాయని సజ్జల విరుచుకుపడ్డారు.