ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. వారి అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయని చెప్పారు.
ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్… రెండు పార్టీల విజయమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్‌పై బయటకు వచ్చారని… ఇదే సమయంలో కాంగ్రెస్ వ్యక్తి రాజ్య సభకు వెళ్లారని చెప్పారు. కవితకు బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపించిన కాంగ్రెస్ అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపిందని సింఘ్వీని ఉద్దేశించి అన్నారు.