Kanna Lakshminarayana will join TDP on february 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకోవడానికే జగన్ సీఎం అయ్యారని మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. దోచుకున్న సంపదతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్ పేరు గడించారని ఎద్దేవా చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా.. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో తన స్థానం ఏంటో అధినేత చంద్రబాబు నిర్థారిస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని.. ఏపీని బిహార్ కంటే దారుణంగా మార్చేశారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని.. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ కు అంత నమ్మకముంటే ప్రతిపక్షాలను చూసి ఎందుకు భయపడుతున్నారని కన్నా ప్రశ్నించారు.
Read Also: