BVR Subrahmanyam: మరో తెలుగు వ్యక్తికి కేంద్ర స్థాయి పదవి వరించింది. నీతి ఆయోగ్(Niti Aayog) కొత్త సీఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో సుబ్రహ్మణ్యం బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. అయ్యర్ ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.
బీవీఆర్ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం. ఈయన తండ్రి స్వగ్రామం ఒడిశాలోని గుణుపురం కాగా, తల్లి స్వస్థలం ఏపీలోని కాకినాడ. విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీలో సుబ్రహ్మణ్యం(BVR Subrahmanyam) చదువుకున్నారు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ బ్రాంచ్ లో బీటెక్.. లండన్ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ పూర్తిచేశారు. 1988 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన సుబ్రహ్మణ్యం 2004-2008, 2012-2015 మధ్యకాలంలో మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీల దగ్గర కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శిగా పనిచేశారు.
Read Also: