వై.ఎస్. వివేకా హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) నేడు ఉదయం 11 గంటలకు మరోసారి సీబీఐ ఎదుట హాజరు కానున్నారు. సీబీఐ విచారణ హజరుకు మినహాయింపు కోరుతూ తెలంగాణ హై కోర్టులో అవినాష్ రెడ్డి ఇప్పటికే పిటీషన్ వేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మినహాయింపు ఇవ్వాలని లేఖ ద్వారా తెలిపిన అవినాష్‌రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాక అవినాష్ రెడ్డి((YS Avinash Reddy) పులివెందుల నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ మరోసారి నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. తెలంగాణ హై కోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో సీబీఐ కాస్త దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది.
Read Also: శాసన మండలి ఎన్నికల్లో అవకతవకలు.. రీ పోలింగ్ నిర్వహించాల్సిందే!
Follow us on: Youtube Instagram