AP News |గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించనుంది. నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ సీఎం జగన్ నూతన చట్టం తీసుకురానున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు విజయసాయిరెడ్డి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశల్లోనే బిల్లు పెట్టాలనుకోవడం గొప్ప నిర్ణయం అని ట్విట్టర్ లో తెలిపారు. ఏపీలో గ్రామ స్వరాజ్యానికి శాశ్వత ముద్ర పడనుందని… 1.35 లక్షల మంది ఉద్యోగులకు రక్ష ఉండనున్నట్లు విజయ సాయిరెడ్డి తెలిపారు.
Read Also: నేడు ఉదయం 11 గంటలకు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి
Follow us on: Youtube Instagram