Free Porn
xbporn
24.2 C
Hyderabad
Thursday, July 25, 2024
spot_img

మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు

    తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కొనుగోళ్లు వివాదం మాజీ సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపి స్తుంది. అధికారం లో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతల మధ్య కరెంటు కొనుగోళ్ల వివాదం మాటల యుద్దానికి తెరలే పింది. జ్యుడిషియల్ కమిషన్ విచారణ చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కరెంటు కొనుగోళ్ల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. దీంతో సమాధానమిచ్చిన కేసీఆర్ నరసింహా రెడ్డి తన బాధ్యతల నుంచి తప్పు కోవాలంటూ లేఖలో పేర్కొనడంతో అగ్గి రాజేసినట్లయింది. కేసీఆర్ రాసిన లేఖపై భట్టి విక్రమార్క స్పందించడం.. ఇదే సమయంలో డిస్కంలు తెరపైకి వచ్చాయి.

  యాదాద్రి విద్యుత్ ప్లాంట్లు, ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతుంది. బీఆర్కే భవన్ లో కమిషన్ కార్యాలయానికి వచ్చిన ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం చేసిన తొందర పాటు వల్ల ట్రాన్స్ కో, జెన్ కోలకు 81వేల కోట్ల అప్పులయ్యాయని తెలిపారు. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లినట్లు జ్యుడిషియల్ కమిషన్ కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. బహిరంగ మార్కెట్ లో చౌకగా కరెంట్ లభిస్తుంటే  అంతకు మించి సొమ్మును ఛత్తీస్ గఢ్ కు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. 261 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ డిస్కంలకు పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు తెచ్చుకునేందుకు పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌తో 1000 మెగావాట్ల సరఫరాకు లైన్‌ కారిడార్‌ను అద్దెకు తీసుకు నేందుకు తెలంగాణ డిస్కంలు రిజర్వు చేసుకోవాల్సి వచ్చింది. ఈ అద్దె భారం కూడా విద్యుత్తు సంస్థలపై పడింది. లైన్‌ బుకింగ్‌ ఒప్పందం ప్రకారం కరెంటు తెచ్చుకున్నా.. తెచ్చుకోకపోయినా పీజీసీఐ ఎల్‌కు ఛార్జీలు చెల్లించాల్సిందే. ఈ లెక్కన కరెంటు రాకున్నా కూడా 638 కోట్ల రూపాయల అదనపు ఛార్జీలు కట్టారు. దీనికి తోడు మరో 1000 మెగావాట్ల సరఫరాకు అడ్వాన్సుగా కారిడార్‌ను గత ప్రభుత్వం రిజర్వు చేసింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి అదనంగా మరో 1000 మెగావాట్ల కరెంటు లభించే అవకాశం లేకపోవడంతో ఈ కారిడార్‌ను ఆ తర్వాత రద్దు చేసుకుంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగి పోయింది. ముందుగా రిజర్వు చేసుకున్నందుకు పరిహారం కింద 261 కోట్ల కట్టాలంటూ డిస్కంలకు పీజీసీఐఎల్‌ నోటీసులు జారీ చేసింది. ఆగమేఘాలపై కారిడార్‌ రిజర్వు ఒప్పందం చేసుకోవడం వల్లే అదనపు చెల్లింపుల సమస్య తలెత్తిదంటూ జ్యుడిషియల్‌ కమిషన్‌కు డిస్కంలు తెలిపాయి.

    ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలు వ్యవహారంలో ఎలాంటి లొసుగులు లేవని అంతా పారద ర్శకంగా జరిగింద న్నారు మాజీ సీఎం కేసీఆర్. పైగా ఆ పీపీఏను ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’ ఆమోదిం చిందని తన లేఖలో పేర్కొన్నారు. ఒక్కో యూనిట్ ను ౩ రూపాయల 90పైసలకే కొనేం దుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని జ్యుడి షియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేగాకుండా ఈఆర్సీ ఆమోదం తెలిపిన తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ కు  ఆ తర్వాత సుప్రీం కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని విచారణ జరిపే అధికారం మాత్రం జ్యుడి షియల్ కమి షన్ కు ఉండ దంటూ కేసీఆర్ అభ్యంతరం తెలిపారు. కాగా కేసీఆర్‌ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటా మన్న కమిషన్‌ చైర్మన్‌ నిపుణులతో ఈ అంశాలను సమీక్షించేపనిలోపడ్డారు. కాగా రాష్ట్ర విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి విచారణ కమిషన్‌ తీరును తప్పుబట్టారు. చత్తీస్‌గఢ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్నట్లు తెలిపారు. చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి ఎక్కువ ధర చెల్లించలే దని స్పష్టం చేశారు. ఇప్పటికీ చత్తీస్‌గఢ్‌ ప్రభత్వం తమకు తక్కువ చెల్లించామం టోందని అన్నారు.

Latest Articles

బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి సభకు కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇవాళ తెలంగాణ బడ్జెట్ సమాశాలకు హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేతగా శాసనసభలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్‌ రాకపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఏం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్