31.1 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

జమిలి ఎన్నికలు దేశ శ్రేయస్సుకు మేలా ?

   ఒకే దేశం  ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాలపై ఏం చేయాలి. ఎలా ముందుకు వెళ్లాలి.! ఇదే అంశం త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ? ఈ విషయంలో భాగస్వామ్య పక్షాలు ఎలా స్పందించే అవకాశం ఉంది ? అసలు జమిలీతో వచ్చే లాభాలేంటి ? కలిగే నష్టాలేంటి అన్న దానిపై మరోసారి చర్చ మొదలైంది.

  లోక్‌సభ ఎన్నికలతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి.. ఆ తర్వాత వంద రోజుల్లోపే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం పూర్తి చేయాలి. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రం వేసిన కమిటీ చేసిన సిఫార్సులివి. వీటితోపాటే మూడు స్థాయిల ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఓటర్ల జాబితా, ఓటరు కార్డులను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ. త్వరలోనే ఈ నివేదిక కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీంతో మళ్లీ దేశంలో జమిలీ ఎన్నికలపై చర్చ మొదలైంది. నిజానికి అఖండ భారతావని లో సరాసరిన ప్రతి ఐదారు నెలలకు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలు ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్కడికక్కడ అడ్డంకులు అవరోధాలు. ఇలాంటి పరిస్థితులపై ఆలోచించిన ప్రధాని నరేంద్రమోడీ గత కొన్నేళ్లుగా జమిలీ పేరు విన్పిస్తున్నారు. ఇదే అంశంపై ఏం చేయాలి ఎలా చేయాలి? సాధ్యా సాధ్యాల సంగతి ఏంటి ? ఇలా పలు అంశాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీ సైతం వేశారు. దీంతో సంబం ధిత కమిటీ రంగంలోకి దిగి వివిధ అంశాలపై అధ్యయనం చేసింది . ఈ ఏడాది మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక అందించారు.

  జమిలీ సాధ్యాసాధ్యాలపై ఇచ్చిన నివేదిక త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు రానున్న నేపథ్యంలో న్యాయశాఖ సైతం ఇందుకు సిద్దమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ వంద రోజుల అజెండాలో భాగంగా ఈ నివేదికను సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గం ముందుకు తీసుకురా నున్నారు. మరోవైపు ఇదే అంశంపై న్యాయశాఖ కూడా త్వరలోనే నివేదికను అందజేయను న్నట్లు సమాచారం. అయితే.. 2029 నుంచే ఈ సిఫార్సులను అమలు చేయాలని, ఒకవేళ హంగ్ ప్రభుత్వం వచ్చినా, అవిశ్వాసం వంటి సందర్భాలు ఎదురైనా ఏకీకృత ప్రభుత్వం కోసం నిబంధనను సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ బయటకు రానున్నాయి.

  మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్ ఇచ్చిన నివేదిక త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు రానున్న నేపథ్యంలో.. మళ్లీ జమిలీ ఎన్నికల అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాజకీయ పార్టీలూ దీనిపై మాట్లాడడం మొదలు పెట్టాయి. అయితే కేంద్రం జమిలీ వైపు రాబోయే రోజుల్లో మొగ్గు చూపినా ఇదంత తేలికగా సాధ్యమయ్యే పని కాదు. అలాగని అసాధ్యమూ కాదు.. కాకపోతే కష్టం అంతే. గతంలోనే లా కమిషన్, పార్లమెంటు స్థాయి సంఘం జమిలీ ఎన్నికలకు మద్దతుగా నివేదికలు ఇచ్చినప్పటికీ ఇందులో అదిగమించాల్సిన ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ, చట్టపరమైన అంశాలు చాలా ఉన్నాయని చెబుతు న్నారు. అయితే వీటన్నింటిలో మొదటగా రాజకీయంగా ఏకాభిప్రాయం సాధిస్తే మిగిలిన అడ్డంకులు అధిగమించడం కొంత సులువేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, గతంలో బీజేపీకి మెజార్టీ ఉన్న సందర్భంలో ఇదంతా కాస్త సులువుగా అన్పించినా.. ప్రస్తుతం బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించని పరిస్థితుల్లో భాగస్వామ్యపక్షాలపై ఆధారపడి ఈ విషయంలో ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత నెలకొంది.

    ఇక, దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే, పార్లమెంటుతోపాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లకూ ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే, వివిధ రాష్ట్రాల శాసనసభలు పూర్తయ్యే గడువులు వివిధ రకాలుగా ఉన్నాయి. ఇలాంటి వేళ రాబోయే సార్వత్రిక ఎన్నికల తో వీటిని కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువులను పొడిగించాల్సి ఉంటుంది. మరికొన్నింటి గడువు తగ్గించాల్సి వస్తుంది. ఒకవేళ లోక్‌సభ ముందస్తుకు వెళ్లినా ఈ మార్పులు చేయాల్సిన పరిస్థి తులు నెలకొంటాయి. అయితే.. ఇది అనుకున్నంత సులువేం కాదు. దీనికి రాజ్యాంగపరంగా అనేక అవరోధాలున్నాయి. ఈ పరిస్థితి అధిగమించాలంటే దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాగే.. మరికొన్ని కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికల నిర్వహణకు వచ్చేసరికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే, మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాదు. సమాఖ్య వ్యవస్థ కూడా. అంటే మన దేశంలో రాష్ట్రాల మాటకూ విలువ ఉంటుంది. అంటే జమిలీ విషయంలో ఆయా రాష్ట్రాలను ఒప్పించాల్సి ఉంటుంది. శాసనసభ కాల పరిమితి తక్కువగా ఉన్న రాష్ట్రాలు జమిలీకి ఒప్పుకున్నా, ఎక్కువగా కాల పరిమితి ఉన్న రాష్ట్రాలు ససేమీరా అంటాయి. ఇక, రాజ్యాంగ సవరణలకు రెండూ బై మూడో వంతు మెజార్టీతో పార్లమెంటు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అలాగే దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదిస్తూ తీర్మానం చేయాలి.

సాధ్యాసాధ్యాల సంగతి ఎలా ఉన్నా జమిలీ నిర్వహణ వైపు ప్రధాని మోడీ మొగ్గు చూపడం వెనుక కారణం దేశంలో ప్రతి నాలుగైదు నెలలకు సరాసరిన ఎక్కడో ఒక దగ్గర ఎన్నికలు జరుగుతూ పథకాల అమలుకు ఆయా ప్రాంతాల్లో బ్రేక్ పడడం ఒక కారణమైతే ఎన్నికల నిర్వహణ ఖర్చు మరోటి. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్లకు పైగా ఖర్చవుతుంది. అదే శాసనసభ ఎన్నికలకైతే ఒక్కో దానికి సగటున 300 కోట్ల రూపాయల ఖర్చు భరించాల్సి వస్తుంది. అదే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఖర్చును చాలా వరకు తగ్గించవచ్చు. అయితే ప్రస్తుతం ఇటీవలె లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. రానున్న ది 2029లోనే. మరి.. అప్పటిలోగా జమిలీ దిశగా ఏ మేరకు కేంద్రం అడుగులు పడతాయన్నది ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో ఆసక్తికరంగా మారింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్