24.7 C
Hyderabad
Sunday, October 1, 2023

ఏపీలో కురిసిన అకాల వర్షాలపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం నుండి ఓ ప్రకటన ద్వారా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని తెలిపారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రాథమిక అంచనా మేరకు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయని క్షేత్ర స్థాయి సమాచారం ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. ఇప్పటికే రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని… ప్రధానంగా కౌలు రైతులు అప్పులతో సతమతమవుతున్నారని అన్నారు. వీరికి తక్షణ ఆర్థిక సాయంతోపాటు పంట నష్ట పరిహారాన్ని సత్వరమే అందించాలని కోరారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు:
‘పల్నాడు ప్రాంతంలో మిర్చి రైతుల బాధలు నా దృష్టికి వచ్చాయి. కళ్ళాల మీద పంట నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ దఫా ధర పెరుగుతోందని ఆశపడ్డ రైతులకు ఆవేదనే మిగిలింది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని మిర్చి రైతులు సైతం నష్టపోయారు. అదే విధంగా ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మామిడి, మొక్క జొన్న, పొగాకు రైతులు కూడా దెబ్బ తిన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల మీద ఆధారపడ్డ రైతులకు ఈ అకాల వర్షాలు, గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అరటి, మొక్కజొన్న, కర్బూజ, బొప్పాయి లాంటి పంటలు దెబ్బ తిన్నాయి. నెల్లూరు జిల్లాలో వరి రైతులు తమ పంట అమ్ముకొనే సమయంలో వర్షాలతో నష్టాల పాలయ్యారు. ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులు వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని ఆదుకొనే విషయంలో ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పంట నష్టాల గణాంకాలను పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా నమోదు చేయాలని అధికారులను కోరుతున్నాను. మా పార్టీ నాయకులకు సైతం క్షేత్ర స్థాయిలో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పాలని సూచించాను’- పవన్ కళ్యాణ్ 

 

Latest Articles

సంక్రాంతి బరిలో లైకా ప్రొడక్షన్స్ ‘లాల్ సలాం’

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
290FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్