Janasena Formation Day |మచిలీపట్నం జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా జిల్లా ఎస్పీ జాషువా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 400 మంది పోలీసులు, మహిళా పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.జిల్లాలో సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది. మంగళగిరిలో బైక్ ర్యాలీలు నిషేదించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎస్పీ ముందస్తు చర్యలు తీసుకున్నారు. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. అందుబాటులో రెండు అంబులెన్స్‌లు, రెండు ఫైరింజన్లు ఉంచారు. ఈ మేరకు ఎస్పీ జాషువా మాట్లాడుతూ.. ‘ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ప్రశాంతంగా సభ జరుపుకోవాలి.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు’ అని తెలిపారు.
Read Also: తెలంగాణలో ఈనెల 15 నుండి ఒంటి పూట బడులు