మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. కేవలం ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రగతి భవన్‌లోకి ఎవ్వరినీ రానివ్వకుండా, సెక్రటేరియట్ వెళ్లకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. ఆనాడు రైతుల వైపు ఉండి కొట్లాడింది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీ కూడా హాజరుకాలేదని అన్నార కేసీఆర్ ప్రజాక్షేత్రం రాబోతున్నాడంటూ బీఆర్ఎస్ నేతలు స్టేట్‌మెంట్లు ఇవ్వడం హస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.